తెలంగాణలో 25 మంది ఎమ్మెల్యేలపై కేసులు పెండింగ్

తెలంగాణలో 25 మంది ఎమ్మెల్యేలపై కేసులు పెండింగ్

తెలంగాణ హైకోర్టులో 25 మంది ఎమ్మెల్యేలపై పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. 2018 ఎన్నికల సందర్భంగా పిటిషన్ లు దాఖలయ్యాయి. మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పిటిషన్ లపై నేతల్లో ఆందోళన మొదలైంది.  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుపై అనర్హత వేటుతో మిగతా ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం 30పైగా పిటిషన్ లు హైకోర్టులో పెండింగ్ లో ఉండగా..అందులో 25 కు పైగా పిటిషన్ లు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలవే కావడం గమనార్హం. 

శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పిటిషన్ లపై కోర్టులో విచారణ జరుగుతోంది. చెన్నమనేని రమేష్, మర్రి జనార్ధన్,ముత్తిరెడ్డి , గూడెం మహిపాల్ రెడ్డి తో పాటు మరికొందరీ పై ఎలక్షన్ పిటిషన్ లు పెండింగ్ లో ఉన్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై  రాఘవేందర్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. శ్రీనివాస్ గౌడ్ పై ట్యాంపరింగ్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది.  మంత్రి కొప్పులపై అడ్లూరి లక్ష్మణ్ పిటిషన్ వేశారు.  ఇద్దరు అడ్వకేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.  బుధవారం కొప్పుల ఈశ్వర్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. గంగుల కమలాకర్ పై బండి సంజయ్ పిటిషన్ వేశారు.  దీనిపై రిటైర్డ్ జడ్జి శైలజతో కమిషన్ వేసింది హైకోర్టు. ఆగస్టు 12 నుంచి 17 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని ఆదేశించింది కోర్టు.  ఈ నెలాఖరులోగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. 

రానున్న రోజుల్లో మరి కొందరి ఎమ్మెల్యేల పిటిషన్ లు విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎవరిపై వేటు పడుతుందోనని అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది.