ఖర్జూరాలు తింటున్నారా ? షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండేందుకు సూపర్ టిప్స్ ఇవే!

 ఖర్జూరాలు తింటున్నారా ? షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండేందుకు సూపర్ టిప్స్ ఇవే!

ఖర్జూర పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ వాటిలో సహజమైన చక్కెర ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్/షుగర్  ఉన్నవారు లేదా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు రక్తంలో షుగర్ లెవెల్స్ సడన్గా పెరగకుండా ఖర్జూరాలను ఎలా తినాలో నోయిడా  డాక్టర్ నిపుణులు కొన్ని చిట్కాలను వివరించారు.... ఖర్జూరాలను ఒట్టిగా తినడం కంటే వాటితో పాటు కొవ్వులు, ప్రొటీన్లు ఉండే నట్స్‌ కలిపి తింటే జీర్ణక్రియ నెమ్మదిగా చేస్తుంది. సాయంత్రం స్నాక్స్ గా... బాదం వెన్న నింపిన ఒక ఖర్జూరం లేదా కొన్ని వాల్‌నట్స్‌తో కలిపి రెండు చిన్న ఖర్జూరాలు తింటే చాలా మంచిది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా చూస్తుంది ఇంకా  తీపి తినాలని  కోరికలను కూడా తీరుస్తుంది. బిస్కెట్లు, ప్యాక్ చేసిన స్నాక్స్ కంటే ఇది ఎంతో మేలు......

 వ్యాయామానికి ముందు
మనం ఖర్జూరాలు తినే సమయం కూడా శరీరంపై చాలా ప్రభావం చూపుతుంది. రాత్రిపూట కదలకుండా కూర్చున్నప్పుడు తినడం కంటే, శారీరక శ్రమకు ముందు తినడం మంచిది. ఏదైనా వ్యాయామానికి 20-30 నిమిషాల ముందు ఒకటి లేదా రెండు ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. రన్నర్లు, అథ్లెట్లు ఈ పద్ధతినే పాటిస్తారు. వ్యాయామం చేయడం వల్ల కండరాలు ఇన్సులిన్‌ను బాగా గ్రహిస్తాయి. దీనివల్ల ఖర్జూరాల నుండి వచ్చే గ్లూకోజ్ రక్తంలో పేరుకుపోకుండా శక్తిగా మారుతుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండే
పీచు పదార్థం ఆహారంలోని చక్కెరను శరీరం నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది. ఖర్జూరాలను నేరుగా తినే కంటే... ఓట్స్, తీపి లేని గ్రీక్ పెరుగు  లేదా చియా పుడ్డింగ్‌లో ముక్కలుగా కోసి కలుపుకోవాలి. ఓట్స్, చియా గింజలలో ఉండే ఫైబర్ ప్రేగులలో ఒక జెల్ లాగా ఏర్పడి, చక్కెర రక్తంలో త్వరగా కలవకుండా అడ్డుకుంటుంది.

►ALSO READ | వాస్తు పూజ ఎందుకు చేయాలి.. గృహప్రవేశం సమయంలో వాస్తు హోమం ఎందుకు చేయాలి.. చేయకపోతే కలిగే నష్టాలు ఇవే..

తినే పరిమాణం
ఖర్జూరాలు పోషక విలువలు ఉన్నవే అయిన.. వాటిలో కేలరీలు ఎక్కువ. ఒక పెద్ద  ఖర్జూరంలో దాదాపు 16 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒకేసారి 6 లేదా 7 ఖర్జూరాలు తినడం చాలా పెద్ద తప్పు. ఎప్పుడైనా సరే ఒకటి లేదా రెండు ఖర్జూరాలు మాత్రమే తినాలి. వీటిని విడిగా  చిరుతిండిలా కాకుండా, వంటల్లో వాడే ఒక సహజ తీపి పదార్థంలా భావించాలి. డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరాలు తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం మంచిది.

సిరప్‌లు, పేస్ట్‌ల కంటే 
మార్కెట్లో దొరికే ఖర్జూర ఉత్పత్తులన్నీ ఒకేలా ఉండవు. ఖర్జూర పండులో ఫైబర్ ఉంటుంది కాబట్టి అది సురక్షితం. కానీ ఖర్జూర సిరప్‌లు, ప్యాక్ చేసిన ఖర్జూర పేస్ట్‌లో ఫైబర్ ఉండదు. ఖర్జూర సిరప్‌లు తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరుగుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ వంటల్లో ఖర్జూర పేస్ట్ వాడితే, దాని గ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి బాదం పిండి, గుడ్లు లేదా నట్స్ వంటివి కలిపి వాడాలి. షుగర్ ఫ్రీ లేదా న్యాచురల్ అని  ఉన్న సరే... అతిగా తింటే ఏ చక్కెర అయినా శరీరానికి నష్టమే చేస్తుంది.