
హైదరాబాద్ పంజాగుట్టలో పెద్ద ప్రమాదం తప్పింది. పెట్రోల్ బంకులో కారులు సడెన్ గా మంటలు చెలరేగటంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
సోమవారం (అక్టోబర్ 06) ట్రోల్ కొట్టించడానికి వచ్చిన కార్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన పెట్రోల్ పంపు సిబ్బంది.. అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేశారు. దీంతో పెట్రోల్ బంకుకు ప్రమాదం తప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ : సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
ఘటన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. పెట్రోల్ బంక్ లో ఉన్న కార్ లో మంటలు రావడంతో సిబ్బంది, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. మంటలను చూసి దూరంగా పరిగెత్తారు వాహనదారులు.
మంటలను ఆర్పిన వెంటనే కార్ ను పెట్రోల్ బంక్ నుండి బయటికి తీసుకెళ్లారు. పంజాగుట్ట లోని ఎర్రమంజిల్ లో ఉన్న పెట్రోల్ బంకులో ఈ ప్రమాదం జరిగింది.