సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కోటా పై నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం: డిప్యూటీ సీఎం భట్టి

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కోటా పై నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం: డిప్యూటీ సీఎం భట్టి

బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు అయిన పిటీషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు.  సోమవారం (అక్టోబర్ 06) విచారణలో భాగంగా పిటిషన్ ను కొట్టివేసింది న్యాయస్థానం.  ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుందని.. అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కోటాపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. కోటాపై ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని అన్నారు.

బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి జీవో కూడా ఇచ్చిందని అన్నారు. బీసీ కోటాపై అన్ని ఆలోచించే ప్రభుత్వం  సజావుగా నిర్ణయం తీసుకుందని అన్నారు భట్టి. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల భాగస్వామ్యంతోనే బీసీ కోటా సాధ్యమని అన్నారు భట్టి. కోటాపై వ్యతిరేక పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. బీసీలకు 42 శాతం కోటా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు భట్టి.

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ప్రెస్ నోట్ :

ఈ అంశంపై స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.సుప్రీం కోర్ట్ తీర్పు శుభ పరిణామని.. 42 శాతం బిసి రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టు లో వేసిన కేసును కోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బిసి లకు రిజర్వేషన్లు ఇచ్చే విశయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామని అన్నారు.ఇప్పటికే ప్రభుత్వం 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్ ఒక జీవో ఇచ్చి బిసి రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిందని అన్నారు మహేష్ కుమార్.

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లు బిసి రిజర్వేషన్లు అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.అక్టోబర్ 8న హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని..బిసిలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు  అన్ని వర్గాలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు మహేష్ కుమార్.