పెద్దపల్లి ఏఓ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

పెద్దపల్లి ఏఓ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లిలోని  మండల అగ్రికల్చర్​ ఆఫీసర్​ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. మూడు గంటల వరకు జరిగిన ఈ తనిఖీలో పలు విషయాలు తమ  దృష్టికి వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.  విత్తనాలు, యూరియా అక్రమంగా నిల్వ ఉంచిన 8 షాపులను గుర్తించినా వాటిపై ఎలాంటి కేసులు పెట్టకపోవడంతోపాటు స్టాక్​ రిజిస్టర్స్​ అప్​డేట్​చేయకుండా నిర్లక్ష్యం వహించినట్లు గుర్తుచేశారు.

35 రైతు బీమా అప్లికేషన్లలో 30 మాత్రమే అప్రూవ్ చేయగా.. మిగిలినవి పెండింగ్​లో ఉన్నాయి. రైతు భరోసాకు సంబంధించిన పూర్తి డాటా ఆఫీసులో పొందుపరచనట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో కరీంనగర్​ ఏసీబీ డీఎస్పీ విజయ్​కుమార్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరుపతి,  పాల్గొన్నారు.