వేములవాడరూరల్/చందుర్తి/కోనరావుపేట/కోరుట్ల, వెలుగు: రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్, చందుర్తి, కోనరావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తున్నారన్నారు. చివరి గింజ వరకు పంటలు కొనుగోలు చేస్తామని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. చందుర్తి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు సెంటర్‌ను ప్రారంభించారు.
అనంతరం రైతు వేదికలో అర్హులైన 90 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌లో వరి కొనుగోలు సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.

