డాక్టర్, పైలట్, వ్యోమగామి గెటప్ లో కోహ్లీ ఇలా ఉంటాడా..

డాక్టర్, పైలట్, వ్యోమగామి గెటప్ లో కోహ్లీ ఇలా ఉంటాడా..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఇప్పటికే ఎన్నో ఆకర్షణీయమైన, ఊహించలేని చిత్రాలు రూపొంది వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ కూడా చేరారు. కృత్రిమ మేధ సాయంతో ఆయన వివిధ రంగాల్లో ఎలా సెట్ అవుతారో.. చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ పోస్ట్‌ను డిజిటల్ సృష్టికర్త సాహిద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన 10 చిత్రాలలో.. విరాట్ కోహ్లి మొదట రాజుగా, భారీ నగలు, కిరీటంతో అలంకరించబడ్డాడు. కూడా బంగారు పూతతో కూడిన సింహాసనంపై కోహ్లీ రాజు గెటప్ లో కూర్చున్నట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత వ్యోమగామి వలె నారింజ రంగు దుస్తులు, స్పేస్‌సూట్‌ను ధరించి, రాకెట్‌లో కూర్చున్నట్టు కనిపిస్తున్నాడు. తర్వాతి పోస్టులో కోహ్లీ ఫుట్‌బాల్ ఆటగాడిలా, డాక్టర్, సంగీతకారుడిగా వివిధ వృత్తులలో కనిపించాడు. మరొక చిత్రంలో అతను సైనికుడిగా కనిపించాడు. యూనిఫాం ధరించి చేతిలో తుపాకీ, నుదిటిపై గాయం ఉంది. ఆ తర్వాత కోహ్లీ ఫైటర్ పైలట్, పోలీసుగానూ కనిపించాడు. ఈ పోస్టుతో పాటు విరాట్ కోహ్లీ మల్టీ వర్స్.. అనే క్యాప్షన్ ను జోడించారు.

ఈ పోస్టుపై నెటిజన్లు పలు కామెంట్లు వదులుతున్నారు. గ్రేట్ అని ఒకరు, కోహ్లీకి కింగ్ లుక్‌లో బాగా సూట్ అయిందని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొందరేమో ఈ చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని, ఫైర్, హార్ట్ ఎమోజీలను కూడా జోడించారు. AI చిత్రాలు స్టార్ క్రికెటర్‌లా కనిపించడం లేదని పలువురు పేర్కొన్నారు. ఒక్క చిత్రం కూడా విరాట్ కోహ్లీలా కనిపించడం లేదని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.

https://www.instagram.com/p/CtLhNEkvcKV/?utm_source=ig_embed&ig_rid=de77e4c1-ae44-415a-bb1b-fe55efd09dbe