అల్లువారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్ తన ప్రేయసి నయనికతో కలిసి మార్చి 6న వివాహ బందంలోకి అడుగుపెట్టబోతున్నారు.. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పెళ్లి ఆహ్వాన పత్రికల పంపణీతో పాటు, ప్రీ వెడ్డింగ్ వేడుక ప్రారంభమయ్యాయి. అయితే తమ్మడి వివాహం సందర్భంగా అల్లు అర్జున్ తన సన్నిహితుల కోసం ఒక ప్రైవేట్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈపార్టీ స్పెషల్ పార్టీకి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ డ్రెస్ కోడ్..
ఈ వేడుకలో 'బ్లాక్ డ్రెస్ కోడ్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టైలిష్ జాకెట్లు, మెరిసే గౌన్లు, సిల్క్ షర్టులతో వేడుక అంతా కలర్ ఫుల్ గా కనిపించింది. ముఖ్యంగా ఈ వేడుకలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయ్యప్ప మాల ధరించి ఉండటంతో చరణ్ నల్లటి కుర్తాలో, పాదరక్షలు లేకుండానే ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ ఫోటో ప్రేమ్ లో అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ రెడ్డి, అల్లు శిరీష్ అతని కాబోయే భార్య నయనిక కలిసి ఉన్నారు. మెగా-అల్లు కజిన్స్ అందరూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "మెగా-అల్లు యూనిటీ" అంటూ అభిమానులు ఈ ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు.
ALSO READ : మహేష్ శ్రీరాముడి లుక్ వైరల్.. బయటపడిన అసలు నిజం !
Yesterday Night Snaps#AA22 🔥🔥 pic.twitter.com/E5CYmWsyRq
— C/o.AlluArjun (@CareOfAlluArjun) February 21, 2026
అన్న పెళ్లి రోజే తమ్ముడి వివాహం..
అల్లు శిరీష్ నయనికల పెళ్లికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ముడిపడి ఉంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం, ఇదే మార్చి 6వ తేదీన అల్లు అర్జున్-స్నేహారెడ్డిల వివాహం జరిగింది. ఇప్పుడు అదే తేదీన తమ్ముడు శిరీష్ కూడా వివాహం చేసుకోవడం కుటుంబంలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది. దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ యాచ్ పార్టీల తర్వాత, ఇప్పుడు హైదరాబాద్‌లోని బన్నీ తన సన్నిహితుల కోసం గ్రాండ్ ఈ స్పెషల్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
🔥#AlluArjun #AA22 pic.twitter.com/I4B4GZrjjz
— Bunny_boy_private (@Bunnyboiprivate) February 21, 2026
మార్చి 6న జరగనున్న ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ దిగ్గజాలు కూడా హాజరుకానున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అత్యంత సన్నిహితంగా, వైభవంగా జరగనున్న ఈ వివాహం టాలీవుడ్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్ వెడ్డింగ్స్‌లో ఒకటిగా నిలవనుంది. కొత్త జంట శిరీష్-నయనికలకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఇప్పుడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
