మార్స్ అగ్నిపర్వతం ఫోటోలను షేర్ చేసిన వ్యోమగాములు.. లావా నదుల అద్భుతమైన సీన్..

మార్స్ అగ్నిపర్వతం ఫోటోలను షేర్ చేసిన వ్యోమగాములు.. లావా నదుల అద్భుతమైన సీన్..

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) అంగారక గ్రహంపై ఉన్న అతిపెద్ద అగ్నిపర్వతం ఒలింపస్ మోన్స్ అడుగు భాగం అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. ఈ అగ్నిపర్వతం 27 కిలోమీటర్ల ఎత్తులో, 600 కిలోమీటర్ల వెడల్పుతో మన సౌర వ్యవస్థలోనే పెద్దది. ఇది భూమిపై ఉన్న మౌనా కీ కంటే రెండు రెట్లు ఎక్కువ ఎత్తు అన్నమాట. 

వ్యోమగాములు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలలో ఒలింపస్ మోన్స్ పైనుండి ప్రవహించిన ఘనీభవించిన లావా నదులు (లావా ప్రవాహాలు) చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 దాని చరిత్ర: దీనిని మొదట 1971లో NASA  మారినర్ 9 అంతరిక్ష నౌక కనుగొంది. ఒలింపస్ మోన్స్ సుమారు 35 వేల లక్షల ఏళ్ల  క్రితం ఏర్పడింది. ప్రస్తుతం నిద్రాణంగా (శాంతంగా) ఉంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ పేలలేదు.

ఫోటోల్లో ఏముంది:  మార్స్ ఎక్స్‌ప్రెస్ ఆర్బిటర్ తీసిన ఈ ఫోటోలలో అగ్నిపర్వతం ఆగ్నేయ భాగంలో వందలాది లావా ప్రవాహాలు, నిటారుగా ఉన్న కొండలు, పాత పగుళ్ల గుర్తులు కనిపిస్తున్నాయి. 9 కి.మీ ఎత్తు వరకు ఉన్న ఒక పెద్ద కొండ అంచు మొత్తం అగ్నిపర్వతాన్ని చుట్టుముట్టి ఉంది. భారీగా కొండచరియలు విరిగిపడటం వలన ఈ శిథిలాలు వందల కిలోమీటర్లు వ్యాపించాయి.

ESA తెలిపిన దాని ప్రకారం లావా ప్రవాహాలు చల్లబడి, గట్టి శిలలుగా మారి, భారీ ఆకారాలను, దారులు, గొట్టాలను ఏర్పరచాయి. కింద మైదానాల్లో ఒకప్పుడు నీటిని, అలాగే లావాను కూడా తీసుకెళ్ళే ఒక "గుర్రపునాడా ఆకారపు దారి" ఉండేదని అంతరిక్ష సంస్థ చెప్పింది.

కొన్ని గుంటలు మాత్రమే ఉన్న ఈ ఉపరితలం, కేవలం పది లక్షల సంవత్సరాల వయస్సు మాత్రమే ఉంటుందని, మార్స్  460 కోట్ల  సంవత్సరాల చరిత్రలో ఇది చాలా చిన్న సంఘటన అని ESA చెప్పింది.

సోషల్ మీడియా స్పందన
ఈ పోస్ట్‌పై స్పందిస్తూ ఒక యూజర్, "నా  మార్నింగ్ వాక్ అక్కడ చేయాలనుకుంటున్నాను" అని అనగా... ఈ భారీ లావా ప్రవాహం అంగారక గ్రహం దాని అయస్కాంత క్షేత్రాన్ని కోల్పోయేలా చేసిందా అని ఆశ్చర్యపోతున్నాను ? అని మరొకరు ... ఆ టెర్రస్‌ శుభ్రం చేస్తే మంచి నగరంగా, అగ్నిపర్వతంలోకి ప్రవేశ ద్వారంగా మారుతుంది అని ఇంకొకరు అన్నారు.