అశ్వారావుపేట విద్యార్థికి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి

అశ్వారావుపేట విద్యార్థికి  రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి

అశ్వారావుపేట, వెలుగు : అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ప్రత్యేక అవసరాల విద్యార్థి కె.నాగరంజిత్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాడు.  హైదరాబాద్ దోమల్ గూడలో రెండు రోజులపాటు నిర్వహించిన ఆటల పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన 50 మీటర్ల రన్నింగ్ పోటీలో రంజిత్ ప్రథమ బహుమతి సాధించాడు.

గురువారం అశ్వారావుపేట జిల్లా పరిషత్​ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి రంజిత్​ను హెచ్ఎం పి.హరిత, టీచర్లు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించి రంజిత్ అందరికీ ఆదర్శంగా నిలిచాడని తెలిపారు. కార్యక్రమంలో టీచర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.