రాబోయే దశాబ్ద కాలానికి  ఖేలో ఇండియా మిషన్ ఏర్పాటు : కేంద్ర మంత్రి బండి సంజయ్

రాబోయే దశాబ్ద కాలానికి  ఖేలో ఇండియా మిషన్ ఏర్పాటు : కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో ప్రతిభతో క్రీడల్లో రాణించే పరిస్థితి లేకపోవడం బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనే నిదర్శనమన్నారు. హెచ్ సీఏలో సెలెక్ట్ కావాలంటే పైరవీలు, డబ్బులు  తీసుకొని సెలెక్ట్ చేసే సంస్కృతిని కొందరు తీసుకొచ్చారన్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాబోయే దశాబ్దకాలానికి ‘ఖేలో ఇండియా మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ను ఏర్పాటు చేస్తోందన్నారు.

ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ పేరిట కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని క్రీడాకారుల కోసం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఈ నెల 1 నుంచి 7 వరకు నిర్వహించిన ఆటల పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు బండి సంజయ్ బహుమతులు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో  ప్రతిభ కలిగిన క్రీడాకారులను  ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏబీవీపీ జిల్లా ఆఫీస్ ప్రారంభం

కరీంనగర్ సిటీ: కరీంనగర్​లో ఏబీవీపీ జిల్లా ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు రఘురాజ్ తివారి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవహా కాచం రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఓ ప్రైవేట్ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రావుల కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, బాబురావు, రాకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పూర్వ కార్యకర్తలు పాల్గొన్నారు.