భద్రాచలం, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న పశువులను భద్రాచలం పోలీసులు బుధవారం పట్టుకున్నారు. చత్తీస్‌గఢ్, ఆంధ్రా బార్డర్లో పశువులను కొనుగోలు చేసి, కంటైనర్‌లో గుట్టుచప్పుడు హైదరాబాద్‌లోని కబేళాలకు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు.
కంటైనర్‌లో 80కి పైగా జీవాలను కుక్కారని, వాహనాన్ని భద్రాచలం టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పశువుల కాళ్లు, కొమ్ములు విరిగాయని చెప్పారు. జీవాలను పాల్వంచలోని గోశాలకు పంపించినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
