భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. దేవస్థానం ఈవో దామోదర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన లెక్కింపులో 38 రోజులకు రూ.1,05,94,090 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
అదనంగా 80 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి లభించాయి. 91 యూఎస్ డాలర్లు, 5 కెనడా డాలర్లు, 2 ఒమన్ రియాల్స్, 20 మలేషియా రింగెట్స్, 5 వేల వియత్నాం డాంగ్స్, 110 న్యూజిలాండ్ డాలర్లు, 5 యూఏఈ దిరహామ్‌లు, 5 మాల్దీవ్ రూఫియాలు వచ్చాయి.
