పేదలకు తక్కువకే  వైద్యమందించాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  

పేదలకు తక్కువకే  వైద్యమందించాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  

శంషాబాద్, వెలుగు: పేదలకు తక్కువ ధరలకే వైద్య సేవలందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌‌‌లో కొత్తగా ఏర్పాటైన లిమ్స్ హాస్పిటల్ ను ఆయన గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా ఉండాలన్నారు. షాద్‌‌‌‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, లిమ్స్ దవాఖాన నిర్వాహకుడు డాక్టర్ రామరాజు పాల్గొన్నారు.