- అడ్డుకుని తోసేసిన పోలీసులు
కామారెడ్డి జిల్లా: నిరుద్యోగుల సమస్యలపై మంత్రితో మాట్లాడేందుకు బీజేవైఎం కార్యకర్తలు విఫలయత్నం చేశారు. గాంధారి మండల కేంద్రంలో సోమవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదే మార్గంలో వస్తున్నారని తెలిసి ఆపి ప్రశ్నించాలని బీజేవైఎం కార్యకర్తలు వేచి చూస్తున్నారు. మంత్రి కాన్వాయన్ ఆపడం చూసి పోలీసులు హడావుడిగా వచ్చి అడ్డుకుని పక్కకు తోసేశారు. పోలీసులతో తీవ్రంగా ప్రతిఘటించిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మంత్రి ప్రశాంత్ రెడ్డి కారు దిగకుండానే వెళ్లిపోయారు.
