సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కిమిన్స్ కు బంపర్ ఆఫర్ వచ్చింది. ఐపీఎల్ లో కీలక ప్లేయర్ గా.. SRH టీమ్ ను అద్భుతంగా లీడ్ చేస్తున్న కమిన్స్ కు ఏకంగా 113 కోట్ల రూపాయల ఆఫర్ తలుపుతట్టింది. టెస్టు క్రికెట్ కు ప్రాధాన్యతనిస్తూ.. టెస్టు క్రికెట్ కోసం పాటు పడేందుకు.. వేరే టౌర్నమెంట్స్ కు దూరంగా ఉండాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆఫర్ చేసింది. మూడు సంవత్సరాలు డీల్ చేసుకునేందుకు బోర్డు ముందుకు వచ్చింది. మొత్తం 12 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్.. అంటే ఏడాదికి 4 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఆఫర్ చేసింది.
ఆస్ట్రేలియా క్రికెట్ వదిలేసి తమ టీ20లో ఫ్రాంఛైజీకి ఆడాలంటూ దాదాపు 6.6 మిలియన్ డాలర్స్ (దాదాపు 55 కోట్లు) ఇచ్చేందుకు ఒక ఫ్రాంఛైజీ ఇటీవలే ఆఫర్ ఇచ్చింది. ఇందులో భాగంగా తమ తరఫున ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ లీగ్స్ జరిగినా ఆడాల్సి ఉంటుందని పేర్కొంది. కమిన్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజ్ ఆఫర్ చేసినట్లు తెలిసిన వెంటనే క్రికెట్ ఆస్ట్రేలియా ఈ భారీ ఆఫర్ తో ముందుకు వచ్చింది. ఐపీఎల్ కే ఫిక్స్ అయిపోతే కష్టమని భావించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.. తమ దేశ టెస్టు, వండేలను దృష్టిలో ఉంచుకుని.. కమిన్స్ ను ఫిక్స్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది.
ఆస్ట్రేలియా టాప్ ప్లేయర్స్ కు లాంగ్ టర్మ్ సెక్యూరిటీ, మంచి రెమ్యూరేన్స్ తప్పని సరిగా ఉండాల్సిందేనా అని అడిగినప్పుడు.. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) హెడ్ ఆఫ్ క్రికెట్ జేమ్స్ ఆల్సోప్ అవుననే అని అంటున్నారు. పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావ్ వంటి మల్టీ-ఫార్మాట్ ఆటగాళ్లకు చాలా డిమాండ్ ఉంది. ఆస్ట్రేలియా క్రికెట్‌కు కట్టుబడి ఉండేలా చూడాలంటే పెద్ద ఎత్తున ఇచ్చుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. కమిన్స్ లాంటి ప్లేయర్స్ ఇచ్చే అధిక రెమ్యూరేషన్ వాళ్లు ఆడే మ్యాచ్ లపై ఆధారపడదని.. వాళ్లకున్న బ్రాండ్ ఆధారంగా ఉంటుందని పేర్కొన్నారు.
