పెరిగిన బంగారం రేట్లు.. గురువారం తెలుగు రాష్ట్రాల్లో వెండి పరిస్థితి ఇదే

పెరిగిన బంగారం రేట్లు.. గురువారం తెలుగు రాష్ట్రాల్లో వెండి పరిస్థితి ఇదే

బుధవారం భారీగా పెరిగిన బంగారం ధరలు గురువారం కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ప్రధానంగా అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు బులియన్ వ్యాపారులను అయోమయంలో ఉండేలా చేస్తుండటంతో.. దాదాపు రెండు నెలలుగా గోల్డ్ అండ్ సిల్వర్ కన్సాలిడేషన్  స్థితిలో కొనసాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు షాపింగ్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా తమ ప్రాంతంలోని తాజా రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం చాలా ముఖ్యం. 

మే 7న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. మే 8 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.33 పెరుగుదలను నమోదు చేసింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 246గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 975గా కొనసాగుతోంది. 

గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 7, 2026న దేశవ్యాప్తంగా రేటు స్థిరంగా కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 75వేల వద్ద మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.275గా అమ్మకాలు జరుగుతున్నాయి.