ఈజీగా ఎలిమినేట్ అవుతుందనుకున్న లక్నో.. పెద్ద టీమ్స్ కు షాకిస్తుందా అన్నట్లు కనిపిస్తోంది. బెంగళూర్ తో మ్యాచ్ లో లక్నో బ్యాటర్ల పర్ఫామెన్స్ అలా ఉంది మరి. మిచెల్ మార్ష్ మ్యాజికల్ ఇన్నింగ్స్ తో ఆర్సీబీకి ఊహించని టార్గెట్ ఇచ్చారు. వర్షం కారణంగా కుదించిన మ్యాచ్ లో నిర్ణీత 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 209 రన్స్ చేశారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో బ్యాటర్లు గెలవాలన్న కసితో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. 9 ఓవర్ల వరకు వికెట్ పడకుండా యావరేజ్ గా రన్ రేట్ 11 పైనే ఉండేలా ఆడారు. పవర్ ప్లేలో ఓపెనర్లు ఇరగదీయటంతో 6 ఓవర్లకు లక్నో స్కోర్ 68–0 చేరుకుంది.
మార్ష్ సెంచరీ:
మిచెల్ మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడనే చెప్పాలి. ఫస్ట్ ఓవర్ లో కాస్త కంట్రోల్ చేసుకున్నప్పటికీ.. సెకండ్ ఓవర్ హేజిల్ వుడ్ బౌలింగ్ లో 1వ బాల్ కు సిక్సుతో స్టార్ట్ చేశాడు. అక్కణ్నుంచి ఎక్కడా తగ్గకుండా సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 56 బాల్స్ ఫేస్ చేసిన మార్ష్.. 9 ఫోర్లు, 9 సిక్సులతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. 111 రన్స్ చేసి హేజిల్ వుడ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణీ (24 బాల్స్ లో 17) కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ.. మార్ష్ కు స్ట్రైట్ రొటేట్ చేస్తూ సహకరించాడు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరణ్ స్టార్టింగ్ లో కాస్త స్లోగా ఆడినా.. తర్వాత.. 4 ఫోర్లు, సిక్సుతో చెలరేగి 38 రన్స్ చేశాడు. పూరన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్.. వచ్చిన బాల్ వచ్చినట్లు బౌండరీకి పంపే ప్రయత్నం చేశాడు. 10 బాల్స్ ఫేస్ చేయగా అందులో 6 బౌండరీలే. 4 ఫోర్లు, 2 సిక్సులతో 32 రన్స్ చేసి స్కోర్ 209 చేరుకునేలా చేశాడు.
ఇక బెంగళూర్ బౌలర్లకు లక్నో పిచ్ అనుకూలించలేదనే చెప్పాలి. మార్ష్ లాంటి ప్లేయర్ ఊచకోతకు పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. హేజిల్ వుడ్, కృణాల్ పాండ్య, రషిక్ సలాం దార్ తలా వికెట్ త ఈసుకున్నారు. భువనేశ్వర్, కృణాల్ తప్ప మిగతా అందరు ఘోరంగా పరుగులు సమర్పించుకున్నారు.
