మీ ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయా.. మార్చి 14 నుంచి కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే కనెక్షన్ కట్!

మీ ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయా.. మార్చి 14 నుంచి కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే కనెక్షన్ కట్!

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ (LPG), పైపు ద్వారా వచ్చే గ్యాస్ (PNG) రెండూ వాడుతున్నారా ? అయితే  జాగ్రత్త. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై ఏదో ఒక కనెక్షన్ మాత్రమే ఉండాలి. మార్చి 14, 2026 నుండి ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చింది.

1. కొత్త నిబంధన ఏంటి ?
పెట్రోలియం శాఖ జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం.. ఎవరి ఇంట్లో అయితే ఇప్పటికే పైపు ద్వారా వచ్చే గ్యాస్ కనెక్షన్ ఉందో, వారు మళ్ళీ సిలిండర్లను కొనడం లేదా రీఫిల్ చేసుకోవడం కుదరదు. ఒకవేళ రెండూ ఉంటే, ఏదో ఒకటి వదులుకోవాల్సిందే.

2. ఎవరిపై ప్రభావం చూపుతుందంటే 
సిటీ నగరాల్లో నివసిస్తూ, పైపుల ద్వారా వంట గ్యాస్ పొందుతున్న వారికి ఈ రూల్  వర్తిస్తుంది. గ్యాస్ కంపెనీలు ఇప్పుడు ఇంటింటికీ వచ్చి లేదా ఆన్‌లైన్ డేటా ద్వారా తనిఖీలు చేస్తున్నాయి. మీరు PNG వాడుతూ కూడా సిలిండర్ బుక్ చేస్తుంటే, మీ గ్యాస్ కనెక్షన్‌ గుర్తించి రద్దు చేసే అవకాశం ఉంది.

3.  ఈ నిర్ణయం ఎందుకంటే 
గత కొద్దీ రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. మన దేశం వంట గ్యాస్ కోసం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.   పైపు గ్యాస్ సదుపాయం ఉన్నవారు కూడా సిలిండర్లు వాడితే, సిలిండర్లు లేని మారుమూల ప్రాంతాల వారికి గ్యాస్ కొరత లేకుండా సరఫరా చేయవచ్చు. ముందస్తు జాగ్రత్తగా విదేశీ యుద్ధాలు లేదా రవాణా ఇబ్బందులు ఎదురైనప్పుడు గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండటమే దీని ముఖ్య  ఉద్దేశ్యం.

4. ఇకపై సిలిండర్ రీఫిల్ కట్ 
కొత్త నిబంధనల ప్రకారం, PNG కనెక్షన్ ఉన్నవారికి గ్యాస్ కంపెనీలు కొత్త సిలిండర్లు ఇవ్వవు, పాత వాటిని రీఫిల్ చేయవు. ఒకవేళ గ్యాస్  సిలిండర్ కావాలనుకుంటే PNG కనెక్షన్ కట్ చేసుకోవాలి.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికే లక్షల మంది సిలిండర్లను వదిలేసి PNGకి మారిపోయారు. కేవలం ఈ ఏప్రిల్ నాటికే సుమారు 4 లక్షల మందికి పైగా వినియోగదారులు సిలిండర్ల వాడకాన్ని పూర్తిగా నిలిపివేశారు.

మీరు ప్రస్తుతం PNG వాడుతుంటే, వెంటనే మీ LPG డిస్ట్రిబ్యూటర్ ని సంప్రదించి మీ సిలిండర్ కనెక్షన్‌ కట్ చేయించుకోవడం  ఉత్తమం. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే అనవసర ఇబ్బందులు, తనిఖీల నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం సిలిండర్లపైనే ఆధారపడే వారికి గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.