హైద్రాబాద్: హైదరాబాద్లో వైన్ షాపు ఓనర్కు డీసీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చిలకలగూడలో వైన్ షాపుపై సికింద్రాబాద్ జోన్ డిసీపీ రక్షితా కృష్ణమూర్తి ఆకస్మిక తనిఖీలు చేశారు. భోయిగూడ రోడ్డులోని జేపీ లిక్కర్ వైన్స్‌లో నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో ఆమె ఈ తనిఖీలు నిర్వహించారు.
రోడ్డుపైనే మద్యం సేవిస్తూ మందుబాబులు స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. బహిరంగ మద్యపానం చేస్తున్న 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మందు బాబులకు పోలీసుల కౌన్సెలింగ్ ఇచ్చారు.
►ALSO READ | కుక్కల వయసు పెరిగిందని... హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి నందిగామ శివారులో వదిలేస్తే...
మళ్లీ ఇలా రోడ్డు పక్కన మందు తాగుతూ స్థానికులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైన్ షాపు యాజమాన్యానికి కూడా డీసీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లైసెన్స్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు ఇచ్చారు.
బహిరంగ మద్యపానంపై ప్రత్యేక కేసులు నమోదు చేయాలని ఎస్‌హెచ్‌వోకు ఆదేశించారు. చిలకలగూడ ప్రాంతంలో నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు హెచ్చరించారు.
