తెలంగాణవారినే జడ్జిలుగా నియమించాలి

తెలంగాణవారినే జడ్జిలుగా నియమించాలి
  •     ఈ విషయంలో తమకు మద్దతు ఇవ్వండి 
  •     కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైకోర్టు అడ్వకేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ వినతి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణ మూలాలున్న న్యాయవాదులనే న్యాయమూర్తులుగా నియమించాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల జరిగిన అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మాన ప్రతిని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందజేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న చారిత్రక, రాజ్యాంగపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని న్యాయవ్యవస్థలో తెలంగాణ మూలాలున్న న్యాయవాదులకు తగిన అవకాశాలు కల్పించాలని వారు కోరారు. 

ప్రస్తుతం న్యాయమూర్తుల నియామకాల విషయంలో తెలంగాణ మూలాలున్న న్యాయవాదులకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని, ఈ పరిస్థితిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని వివరించారు.తెలంగాణకు చెందిన న్యాయవాదులకే న్యాయమూర్తుల నియామకాలలో ప్రాధాన్యం కల్పించేలా కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని, తమ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతు ఇవ్వాలని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్... ఈ అంశానికి సంబంధించి తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు డీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండు, కార్యదర్శులు పి.శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కె.నిరంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి పి.కృష్ణ కీర్తన, కోశాధికారి బాలాజీ బానోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్రీడా, సాంస్కృతిక కార్యదర్శి విష్ణువర్ధన్ జయసూర్య, కమిటీ సభ్యులు కొండారెడ్డి జక్కా, షిల్పా గెల్లి, పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్ నాయక్ రామావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రవి పొనంపల్లి తదితరులు పాల్గొన్నారు.