హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసానికి గురై డబ్బులు పోగొట్టుకున్న కొందరు బాధితులకు ఊరట లభించింది. శనివారం నిర్వహించిన లోక్అదాలత్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6,303 మంది బాధితులకు రూ.45.21 కోట్లు రీఫండ్ అందించారు. తెలంగాణ సైబర్సెక్యురిటీ బ్యూరో, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ, బ్యాంకులు, అన్ని జిల్లాల, కమిషనరేట్ల పోలీస్ అధికారుల సమన్వయంతో బాధితులకు రీఫండ్ అందించగలిగినట్టు టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అత్యధికంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2,232 మంది బాధితులకు రూ.21.91 కోట్లు రీఫండ్ అందించినట్టు చెప్పారు. టీజీ సీఎస్బీ పరిధిలోని కేసులలో 77 మంది బాధితులకు రూ.6.83 కోట్లు, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 779 మంది బాధితులకు రూ.4.04 కోట్లు, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 755 మంది బాధితులకు రూ.3.2 కోట్లు రీఫండ్ అందించినట్టు పేర్కొన్నారు.
