హైదరాబాద్ లో ఘోరం: ఇంట్లో మంటలు చెలరేగి... నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డు సజీవ దహనం...

హైదరాబాద్ లో ఘోరం: ఇంట్లో మంటలు చెలరేగి... నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డు సజీవ దహనం...

హైదరాబాద్ లోని లక్ష్మిగూడలో ఘోరం జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగడంతో నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డు నిద్రలోనే సజీవ దహనం అయ్యాడు. గురువారం ( మే 7 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మిగూడలో బృందావన్ కాలనీలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న వికాస్ అనే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యాడు.

బీహార్‌కు చెందిన వికాస్ గత కొంతకాలంగా లక్ష్మీగూడ బృందావన్ కాలనీలో నివసిస్తూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.