పెళ్లవుతున్న ఆనందంలో వధువు హంగామా

పెళ్లవుతున్న ఆనందంలో వధువు హంగామా

పెళ్లిలో వధువు ఆనందంతో ఉబ్బితబ్బిబైన వీడియో వైరల్ గా మారింది. తమిళ సంప్రదాయంలో జరిగిన పెళ్లిలో వధువు చేసిన హంగామా హైలెట్ అయ్యింది. తాళికట్టే వేళ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. పట్టరాని సంతోషంతో కేరింతలు కొడుతూ మూడు ముళ్లు వేయించుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ మీరు కూడా ఇలాగే ఉంటారా.. అని ప్రశ్నించారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి.