నిజాంపేట్లోని డీ మార్ట్ దగ్గర ఉన్న.. చైతన్య డీఐ కాఫీ షాప్లో ఇంత జరుగుతుందా..?

నిజాంపేట్లోని డీ మార్ట్ దగ్గర ఉన్న.. చైతన్య డీఐ కాఫీ షాప్లో ఇంత జరుగుతుందా..?

జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లి పల్లి పీఎస్ ​పరిధిలోని ఓ కాఫీ షాప్​ ముసుగులో హుక్కాసెంటర్ ​నడుపుతున్నారని తెలుసుకుని మాదాపూర్​ ఎస్వోటీ పోలీసులు రైడ్స్​ నిర్వహించారు. నిజాంపేట్​లోని డీ మార్ట్​వద్ద చైతన్య డీఐ కాఫీ షాప్​పేరుతో కొంతకాలంగా హుక్కా సెంటర్​ రన్​ చేస్తున్నాడు.

విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్​ ఎస్వోటీ పోలీసులు మంగళవారం రాత్రి  దాడులు నిర్వహించారు. రూ.1.09 లక్షల విలువైన 17 హుక్కా పాట్లను స్వాధీనం చేసుకున్నారు. చైతన్యతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్​ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.