- డిప్యూటీ సీఎం భట్టి కుమారుడు, కోడలికి ఆశీర్వాదం
హైదరాబాద్, వెలుగు: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం హైదరాబాద్ బేగంపేటలోని ‘ప్రజా భవన్’ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నందిని దంపతులు, మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి ఘనస్వాగతం పలికారు.
అనంతరం ఇటీవల వివాహం చేసుకున్న విక్రమాదిత్య, స్వేచ్ఛ దంపతులను చంద్రబాబు ఆశీర్వదించారు.ఈ నెల 5న విక్రమాదిత్య వివాహం జరగగా.. ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల చంద్రబాబు ఆ వేడుకకు హాజరుకాలేకపోయారు. అంతకుముందు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు స్వయంగా అమరావతికి వెళ్లి చంద్రబాబును ఆహ్వానించారు.
