కేసీఆర్... బీఆర్ఎస్ కు నీ కొడుకే గుదిబండ.. కేటీఆర్ ఉన్నంతకాలం మీ పార్టీని బొందపెడ్తరు: రేవంత్

కేసీఆర్... బీఆర్ఎస్ కు నీ కొడుకే గుదిబండ.. కేటీఆర్ ఉన్నంతకాలం  మీ పార్టీని బొందపెడ్తరు: రేవంత్

 జూబ్లీహిల్స్ రెఫరెండం అంటే బీఆర్ఎస్ ను  బండకేసి కొట్టారని విమర్శించారు రేవంత్. బీఆర్ఎస్ కు మీ కొడుకు  కేటీఆరే గుదిబండ అని.. కేటీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ను బొందపెడుతూనే ఉంటారని అన్నారు. దేవరకొండ బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్..    ఇద్దరు సర్పంచులను, వార్డు మెంబర్లను కేసీఆర్  పిలిపించుకుని మాట్లాడారని.. గతంలో  కేసీఆర్ ఎవరితోనైనా మాట్లాడేవారా అని ప్రశ్నించారు రేవంత్.   ప్రజాప్రతినిధులకు  కూడా అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్.. ఇపుడు సర్పంచ్ లను,వార్డు మెంబర్లను  పిలిచి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఒకప్పుడు కేసీఆర్ ఎంతో ఘనంగా బతికారని.. వాళ్ల ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్ ఇచ్చేవాడు కాదన్నారు...మంత్రులను గేట్ దగ్గరి నుంచే పంపించేవారని చెప్పారు.

నిలువ నీడలేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు రేవంత్.  గత పదేండ్లలో కేసీఆర్  ఎవరికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నామని..ఇందిరమ్మ ఇండ్ల కోసం 22500 కోట్ల ఖర్చుచేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ పదెకరాల్లో 150 కోటల గడీ కట్టుకున్నారు కానీ..పేదవాడికి ఒక్క డబుల్ బెడ్రూం ఇవ్వలేదని చెప్పారు. 200యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వడంతో పేదల ఇంట్లో వెలుగులు నిండాయన్నారు.  పేదవాళ్ల పట్ల  కేసీఆర్ కు అభిమానం లేదన్నారు. లంబాడీలకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ అని చెప్పారు. గిరిజనుల మధ్య  పంచాయతీ పెట్టాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంచిరోజులొస్తాయంటున్నారని.. తెలంగాణను పీక్కతిన్న మీ ఆకలి తీరలేదా?. 8లక్షల కోట్ల అప్పులు చేసిన ఆకలి తీరలేదా అని ప్రశ్నించారు రేవంత్. 

ఆనాడు చెప్పులు అరిగేలా తిరిగినా రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు రేవంత్.  ప్రజాపాలనలో అడిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తున్నామన్నారు.  రాష్ట్రంలో అత్యధిక రేషన్ కార్డులు దేవర కొండలోనే ఉన్నాయని తెలిపారు., కొత్త రేషన్ కార్డులతో పేదవాడు ఆత్మగౌరవంతో బతికేలా చేశామన్నారు. 3కోట్ల తెలంగాణ ప్రజలు సన్నబియ్యం తింటున్నారని చెప్పారు. పేదల ఆకలి తీరినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు.  తెలంగాణలో తప్ప ఏ రాస్ట్రంలోనైనా సన్నబియ్యం ఇస్తున్నారా అని ప్రశ్నించారు రేవంత్.  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సన్నబియ్యం ఇవ్వడం లేదన్నారు. సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అభివృద్ధి ,సంక్షేమం రెండు కళ్లుగా భావించి ముందుకెళ్తున్నామన్నారు.