జగిత్యాల టౌన్, వెలుగు: రోడ్డు భద్రతా నియమాలు పాటించడం అందరి బాధ్యత అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం- 2026లో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ప్రారంభించారు. కొత్త బస్టాండ్ వరకు సాగిన ర్యాలీలో ‘హెల్మెట్ ధరించండి–- ప్రాణాలు కాపాడుకోండి’ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, రవాణా శాఖ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
