పిల్లల్ని ముళ్లపొదల్లో పడేయకండి.. మెదక్  ఎంసీహెచ్ వద్ద ఊయల ఏర్పాటు

పిల్లల్ని ముళ్లపొదల్లో పడేయకండి.. మెదక్  ఎంసీహెచ్ వద్ద ఊయల ఏర్పాటు

మెదక్, వెలుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, హెల్త్  డిపార్ట్​మెంట్  సహకారంతో మెదక్​ పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎం సీహెచ్) వద్ద గురువారం ఊయల ఏర్పాటు చేశారు. ఎవరైనా పిల్లలు వద్దనుకుంటే ముళ్లపొదలు, చెత్త కుప్పల్లో పడేయకుండా ఆ పిల్లలను తీసుకువచ్చి ఊయలలో వదిలి వెళ్లొచ్చని నిర్వాహకులు తెలిపారు.

ఆ పిల్లలను మహిళా శిశు సంక్షేమ శాఖ రక్షణ, సంరక్షణ బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ఊయలను మున్సిపల్​ వైస్​ చైర్​పర్సన్​ దొంతి నరేశ్​గౌడ్, వార్డు కౌన్సిలర్​ అనీష్  ఫాతిమా ప్రారంభించారు. ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్​ రేవతి, గైనకాలజీ హెచ్​వోడీ డాక్టర్​ రాజేశ్వరి పాల్గొన్నారు.