రామ్ ‘ది వారియర్‌’ థియేట్రికల్ ట్రైలర్కు డేట్ ఫిక్స్ 

రామ్ ‘ది వారియర్‌’ థియేట్రికల్ ట్రైలర్కు డేట్ ఫిక్స్ 

లింగుస్వామి డైరెక్షన్లో ..ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్‌’ జూలై 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రామ్ సరసన అందాల భామ కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా..శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై ఈ తెరకెక్కగా.. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించాడు. హీరా రామ్‌ పోలీసు పాత్రలో కనిపించనున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిందని టాక్. అయితే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. జూలై 1న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. జూలై-1న రాత్రి 7-57 నిమిషాలకు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అంటూ ఓ పోస్టర్ వదిలారు. ఇందులో రామ్ ఒక్కడే నిలబడి ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన బుల్లెట్‌ లిరికల్‌ సాంగ్‌కు క్రేజీ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సాంగ్‌లో రామ్‌, కృతి వేసిన స్టెప్పులు అందరినీ ఆకర్షించాయి. అలాగే‘విజిల్’ అనే సాంగ్ కూడా ఆకట్టుకుందంటున్నారు ఫ్యాన్స్. ఈ పాటను హీరో సూర్య చేతుల మీదుగా ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాను జులై 14న తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్‌.