కరోనా కేసుల సంఖ్య పెరగడం లేదు

కరోనా కేసుల సంఖ్య పెరగడం లేదు

కరోనా కేసుల సంఖ్య పెరగడం లేదన్నారు తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు. ప్రభుత్వం చేపట్టిన కట్టడి చర్యలు ఫలిస్తున్నాయన్నారు.ప్రభుత్వం కోవిడ్ రూల్స్ పాటిస్తున్నారన్నారు. కరోనా వచ్చిన 85 శాతం మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదన్నారు. రాబోయే మూడు, నాలుగు వారాలు కీలకమన్నారు. ఇప్పటికంటే మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. పరిస్థితి  అదుపులోకి రావడానికి టైమ్ పడుతుందన్నారు.విడుతల వారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. అలా అని అలసత్వం పనికి రాదన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారే టెస్టు చేయించుకోవాలన్నారు. ఆందోళన పడి టెస్టులు కోసం బారులు తీరొద్దన్నారు.లక్షణాలు లేని వారు టెస్ట్ కోసం వెళ్లి రిస్క్ లో పడొద్దన్నారు.