మరికొన్ని గంటల్లో ..తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్

మరికొన్ని గంటల్లో ..తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు. 5 రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటించనుంది సీఈసీ. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే ఈ 5 రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఎన్నికల ఏర్పాట్లు, ఇతర అంశాలను పరిశీలించారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చారు.


5 రాష్ట్రాల్లో నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఎన్నికలు జరగొచ్చని ఈసీ వర్గాలు గతంలో తెలిపాయి. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్ లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే చాన్సుంది. ఛత్తీస్ ఘడ్ లో మాత్రం భద్రతా కారణాలతో 2 విడతల్లో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17 ను ముగియనుంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ ఘఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువు 2024 జనవరి వరకు ఉంది. 

ఐదు రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్ లో 200 అసెంబ్లీ నియోజకవర్గాలు, చత్తీస్ గఢ్ లో 90 అసెంబ్లీ సీట్లు, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది CEC. 

ఎన్నికల సమరంలో ముందుంది అధికార బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే 114 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించారు కేసీఆర్. మంత్రులు హరీష్, కేటీఆర్ రోజూ నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉంది. రెండు రోజుల్లో 50శాతం అభ్యర్థులను ప్రకటిస్తామని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ కూడా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని అంటోంది. ఇక బీఎస్పీ 20 మంది అభ్యర్థులను ప్రకటించింది.