బషీర్‌బాగ్, వెలుగు: జాతీయ స్థాయిలో చట్టబద్ధత గల ఓసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఓసీ జేఏసీ జాతీయ ఉపాధ్యక్షుడు చందుపట్ల నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి గట్టు మహేశ్‌బాబుతో కలిసి ఢిల్లీలో చేపట్టనున్న మహాధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి ఉన్న ఆదాయ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓసీలకూ వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 27న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 10 వేల మందితో మహాధర్నా
నిర్వహించనున్నట్లు తెలిపారు.
