సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపెల్లి గ్రామంలో మొక్కజొన్న పంట దగ్ధం

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపెల్లి గ్రామంలో మొక్కజొన్న పంట దగ్ధం

బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపెల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు  మొక్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామంలో హార్వెస్టర్‌‌‌‌‌‌‌‌తో పంటలు కోస్తుండగా నిప్పు రవ్వలు చెలరేగి సుమారు 10 ఎకరాల్లో మొక్కజొన్న దగ్ధమైంది.

 గ్రామానికి చెందిన చెల్కల కొండారెడ్డివి రెండెకరాలు, చిలకల ప్రతాపరెడ్డి మూడు, కేశవరెడ్డి మూడు, సుధగోని రాజయ్య ఒక ఎకరంలో పంట కాలిపోయింది. చేతికి వచ్చిన పంట కండ్ల ముందే కాలిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.