వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీసులోఅగ్ని ప్రమాదం

వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీసులోఅగ్ని ప్రమాదం
  • కీలక రికార్డులు దగ్ధం  
  • ఘటనపై అనుమనాలు  

మల్కాజిగిరి, వెలుగు : కాప్రా సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీసులో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఫర్నిచర్​, ముఖ్యమైన రికార్డులు దగ్ధమయ్యాయి. అయితే, దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటల తీవ్రత వల్ల భవన గోడలకు పగుళ్లు వచ్చాయి.

ఫైర్​ఫైటర్స్​కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. షార్ట్​సర్క్యూట్​వల్ల ఫైర్​యాక్సిడెంట్​జరిగిందని చెప్తున్నా తమకు అనుమానంగా ఉందని అసోసియేషన్​సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.