రాజన్న సిరిసిల్ల, వెలుగు: కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని వసతులతో నూతన కోర్టు భవన సముదాయాలు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ తెలిపారు. సిరిసిల్లలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.81 కోట్ల 60 లక్షల వ్యయంతో 12 రకాల న్యాయస్థానాలల బిల్డింగ్ నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించగా, హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన లో పాల్గొన్నారు.
నూతన కోర్టు భవన సముదాయం అన్ని కోర్టుల నిర్వహణకు సరిపోయే విధంగా ఉంటుందని వెల్లడించారు. జిల్లా కోర్టులో 13 వేల కేసులు పైగా కేసులు పెండింగ్ లో నున్నట్లు తెలిపారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. ఈ నూతన కోర్టు భవన నిర్మాణం ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతుందని హైకోర్టు న్యాయమూర్తి కం జస్టిస్ ఎన్ తుకారాంజీ పేర్కొన్నారు. అనంతరం దివ్యాంగ డిగ్రీ, ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, బ్యాటరీ వీల్ చైర్లు పంపిణీ చేశారు. జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్ రెడ్డి పాల్గొన్నారు.
