
- అమెరికా పారిపోయినా పట్టుకొస్తం: గజ్జెల కాంతం
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీఆర్, కవితను జైలుకు పంపిస్తారనే భయం కేసీఆర్‌కు పట్టుకున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జెల కాంతం అన్నారు. కేటీఆర్‌ను వెంటనే అమెరికాకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశం విడిచి పారిపోయినా.. పట్టుకొచ్చి జైళ్లో వేస్తామన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత ఉద్యమకారులు కాదని.. ఉద్యమ ద్రోహులు అని మండిపడ్డారు.
బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు మతిస్థిమితి లేకుండా పోయిందని విమర్శించారు. ‘‘హరీశ్‌కు అగ్గిపెట్టే దొరక్క.. అమాయక పిల్లలు చనిపోయారు. శ్రీకాంతా చారి మరణానికి కేసీఆర్, హరీశ్ రావులే కారణం’’అని అన్నారు.