హైదరాబాద్ లో కొనసాగుతున్న బోనాల సందడి

 హైదరాబాద్ లో కొనసాగుతున్న బోనాల సందడి

పద్మారావునగర్/ముషీరాబాద్, వెలుగు: ఆషాఢం బోనాల ఉత్సవాలు నగరంలో కంటిన్యూ అవుతున్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని లేబర్​ కమిషనర్ కార్యాలయంలో ఉత్సవాలు జరుపుకున్నారు. అమ్మవార్లకు బోనాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమాల్లో గాంధీ మెడికల్​ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రవి శేఖర్​రావ్, ప్రొఫెసర్లు కృపాల్ సింగ్, రమాదేవి, పూర్ణయ్య, చంద్రశేఖర్, ఏడీ జగదీశ్వర్, అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్, శ్యాంసుందర్ రెడ్డి, సునీత, చంద్రశేఖర్​ పాల్గొన్నారు.