
సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పనివేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. టైమింగ్స్ మారుస్తూ..విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉదయం 8.00 గంటలనుండి ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాల టైమింగ్స్ ను 9.00 గంటలకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా టైమింగ్స్ ప్రకారం...ఇక పై ప్రతిరోజూ ఉదయం 9.00 నుండి సాయంత్రం 4.30 వరకు రెగ్యులర్ తరగతులు జరుగుతాయని గురుకుల విద్యాలయాల సొసైటీ జాయింట్ సెక్రటరీ వెల్లడించారు. 2022-2023 అకాడమిక్ ఇయర్ లో ఈ టైమింగ్స్ ఫాలో కావాలని సూచించారు.