కరోనా నివారణ ఖర్చుల కోసమే పెట్రో ధరలు పెంపు

కరోనా నివారణ ఖర్చుల కోసమే పెట్రో ధరలు పెంపు

కరోనా నివారణ ఖర్చుల కోసమే పెట్రో ధరలు పెరిగాయన్నారు కర్ణాటక బీజేపీ మంత్రి ఉమేష్‌ విశ్వనాథ్‌. కరోనాను నివారించాలంటే ప్రభుత్వాలకు డబ్బు కావాలని.. అందుకే ధరలు పెరుగుతున్నాయన్నారు. దేశీయంగా చమురు ధరలను కంపెనీలు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాయన్నారు మంత్రి ఉమేశ్. 

ఇవాళ( బుధవారం) తాజాగా పెట్రోల్‌, డీజిల్‌లపై 35 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ. 106కి చేరగా..ముంబైలో రూ. 112కి పెరిగింది. కోల్‌కతాలో రూ. 107గా ఉండగా, చెన్నైలో రూ. 103గా ఉంది. గత కొన్ని రోజులుగా డీజిల్‌ ధరలు కూడా ఇంచుమించుగా వంద మార్క్‌కు చేరువలో ఉంటున్నాయి. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 109కాగా, డీజిల్‌ రూ. 100కి చేరింది.