కారేపల్లి, వెలుగు: మండలంలోని బీక్యాతండా తిరుపతమ్మ తల్లి దేవాలయంలో శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కల్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. తిరుపతమ్మ తల్లి మాల ధరించిన మాలధారుల ఇరుముడి కార్యక్రమాన్ని కూడా భక్తిశ్రద్ధలతో ఘనంగా చేపట్టారు. కల్యాణ మహోత్సవానికి వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త అజ్మీర కృష్ణ ఆధ్వర్యంలో కల్యాణం ఊరేగింపు చేపట్టారు.
