సీతారామయ్యకు సువర్ణ తులసీ దళ అర్చన

సీతారామయ్యకు సువర్ణ తులసీ దళ అర్చన

భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీ దళాలతో అర్చన ఘనంగా నిర్వహించారు. గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి సుప్రభాత సేవ చేశాక.. గర్భగుడిలో మూలవరులకు బంగారు తులసీ దళాలతో అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు  పాల్గొన్నారు. అనంతరం రామపాదుకలను భద్రుడి మండపానికి తీసుకెళ్లి పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు.

సీతారాముల కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. 86 మంది జంటలు కంకణాలు ధరించి క్రతువును నిర్వహించారు. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక, మంత్రపుష్పం అనంతరం క్రతువు ముగిసింది. సాయంత్రం స్వామికి దర్బార్ సేవ చేశారు.