ఉత్సాహంగా ఎన్సీసీ డే వేడుకలు

ఉత్సాహంగా ఎన్సీసీ డే వేడుకలు

ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజీలో మంగళవారం ఎన్సీసీ డే వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులు చేసిన ఎన్సీసీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాలేజీ సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి హాజరై ఎన్సీసీ క్యాండిడేట్స్​కు మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడంలో ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

విద్యార్థులు ఎన్సీసీ ద్వారా పొందిన శిక్షణను జీవితంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొఫెసర్ యాదగిరి, ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్, ఎన్సీసీ అధికారి కిరణ్ కుమార్ తో పాటు ఎన్సీసీ విద్యార్థులు, అధ్యాపకులు  పాల్గొన్నారు.