బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెట్టండి : హరీశ్‌‌‌‌ రావు

బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెట్టండి :  హరీశ్‌‌‌‌ రావు
  • ప్రభుత్వానికి హరీశ్‌‌‌‌ రావు డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సీఎం రేవంత్​రెడ్డిని బీఆర్ఎస్​ఎమ్మెల్యే హరీశ్​రావు డిమాండ్​చేశారు. తాము మాట్లాడేటప్పుడు మైక్​కట్​చేయకుండా, కెమెరా తిప్పకుండా ఉంచాలన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో హరీశ్ మాట్లాడారు. ‘‘అసెంబ్లీ సమావేశాలను వెంటనే మొదలుపెట్టండి. 15 రోజులు కృష్ణా, 15 రోజులు గోదావరి నీళ్ల మీద చర్చ పెడదాం. మధ్యలో వాయిదా వేసి పారిపోవద్దు. మీరు ప్రజెంటేషన్​ఇవ్వండి.. మేమూ ఇస్తం’’ అని ఆయన చెప్పారు.

 ఓవైపు గోదావరి, మరోవైపు కృష్ణా నీళ్ల తరలింపు కోసమే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు అని.. ఎలా చూసినా అది తెలంగాణకు మరణశాసనం కాబోతున్నదని అన్నారు. ‘‘ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హైదరాబాద్‌‌‌‌లో ఇచ్చినట్టుగా లేదు.. అమరావతిలో ఇచ్చినట్టుంది. పీపీటీని తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా? లేక ఏపీ తయారు చేసిందా? బనకచర్లను ఆపాలన్న చిత్తశుద్ధి ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలు, ఆయన మాట్లాడిన మాటలను ప్రజెంటేషన్‌‌‌‌లో చూపించాల్సింది.

 రేవంత్​రెడ్డి టెక్నికల్‌‌‌‌గా కాంగ్రెస్​సీఎం అయినా.. ఆయన హృదయం ఇంకా తెలుగుదేశంలోనే ఉంది” అని విమర్శించారు. 2024 జులై 6న ప్రజాభవన్‌‌‌‌కు చంద్రబాబును పిలిచి.. విభజన హామీల ముసుగులో గోదావరి–బనకచర్లపై చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ప్రజాభవన్​వేదికగా తెలంగాణ నీటి హక్కులకు సీఎం రేవంత్​ రెడ్డి మరణశాసనం రాశారని మండిపడ్డారు. 2024 సెప్టెంబర్​13న మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి సతీసమేతంగా విజయవాడలో చంద్రబాబును కలిసి బెజవాడ బజ్జీలు తిని బనకచర్లకు మద్దతు చెప్పి వచ్చారన్నారు. 2016లో నిర్వహించిన అపెక్స్​కౌన్సిల్​మీటింగ్‌‌‌‌లో అసలు బనకచర్ల అనే పదం ఉందా? ప్రశ్నించారు.