హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై చర్యలు తీస్కోవాలి : లంబాడీ హక్కుల పోరాట సమితి

హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై చర్యలు తీస్కోవాలి : లంబాడీ హక్కుల పోరాట సమితి

బషీర్ బాగ్, వెలుగు: ప్రభుత్వ అధికారులు స్వలాభం కోసం అక్రమాలకు పాల్పడుతున్నారని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ నాయక్ విమర్శించారు. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్​రావు అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లంబాడీ హక్కుల పోరాట సమితి, ఎస్టీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ‘చలో ప్రగతి భవన్’కు పిలుపునివ్వగా, హైదర్ గూడలో సమావేశమైన రెండు సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ఈ సందర్భంగా రాజేశ్​నాయక్ మాట్లాడుతూ.. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు చేసిన అవినీతి, అక్రమాల వివరాలను ఆధారాలతో మంత్రి హరీశ్ రావుకు అందజేసినా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ట్రైబల్ రిజర్వేషన్ పోస్టులను తన అనుకూలమైన వారికి అమ్ముకున్నారని ఆరోపించారు.  ఆయనపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్రంలోని 42 లక్షల మంది లంబాడీలను ఏకంచేసి బీఆర్ఎస్​ను ఓడించేందుకు పనిచేస్తామని హెచ్చరించారు.