హైదరాబాద్సిటీ, వెలుగు: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా నివారించేందుకు మినీ కంటైనర్లు ఏర్పాటు చేయాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులకు సూచించారు. శారదానగర్, శారదా నగర్ ఫేజ్–-3, కల్వంచ శ్రీనగర్ కాలనీ, హయత్నగర్ సమీపంలోని అమంగల్ ప్రాంతాల్లో పర్యటించారు. శారదా నగర్ ఫేస్ – 3 లో స్వచ్ఛ ఆటో డ్రైవర్లతో మాట్లాడారు.
శారదా నగర్ లో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు కలుస్తుందని ప్రజలు ఫిర్యాదు చేయడంతో అధికారులతో చర్చించారు. కలుషిత నీరు, ఓవర్ ఫ్లో సమస్యల్లేకుండా వర్షపు నీటి కాలువలు, డ్రైనేజీ వాటర్ లైన్ వేరువేరుగా ఏర్పాటు చేయాలని సూచించారు.
