
కొందరు సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. చిన్నపిల్లలతో ఏదో మాట్లాడించి హైడ్రాను బద్నాం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. భూ కబ్జాలను కూడా హైడ్రా కాపాడుతుందన్నారు. ఇప్పటి వరకు 95 ఆపరేషన్స్ చేసిన హైడ్రా.. 923 ఎకరాల స్థలం కాపాడిందని చెప్పారు. దీని విలువ 45 వేల నుంచి 50 వేల కోట్లు ఉంటుందన్నారు.
మీడియాతో మాట్లాడిన రంగనాథ్..‘ గాజుల రామారంలో కబ్జాలో ఉన్న నిర్మాణాలను మాత్రమే కూల్చేశాం. కాళీగా ఉన్న ఇండ్లను మాత్రమే కూల్చాము. 621 ఇండ్లల్లో ప్రజలు ఉండడంతో ఆ ఇళ్లను కూల్చలేదు. కొందరు స్థానిక రౌడీ షీటర్లు కబ్జా చేసి.. చిన్న చిన్న గదులు నిర్మించి అందులో పేదవారిని ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఎదురు డబ్బులు ఇస్తూ ఆ ఇళ్లల్లో ఉంచుతున్నారు. కొందరు డబ్బులు పెట్టి కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ముందుకొచ్చి ఎవరి నుంచి కొన్నారో చెబితే.. వారికి న్యాయం చేయడానికి హైడ్రా సిద్ధంగా ఉంది. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేస్తున్నారు. ప్రజలు సోషల్ మీడియా విషయంలో అప్రమతంగా ఉండాలి. సోషల్ మీడియాపై మాట్లాడాలని అనుకోవడం లేదు.
వర్టేక్స్, వాసవి విషయంలో హైడ్రా కుమ్మకైందని చాలామంది అంటున్నారు. ఎక్కడైనా ఎంక్వయిరీ చేసుకోచ్చు. వార్టెక్స్ పై మొదట కేసు పెట్టింది హైడ్రానే . ముసాపేట్ లో నాలా ఎంక్రోచ్ చేస్తే వాసవి పై కూడా కేసు పెట్టాం. వర్టేక్స్ విషయంలో కాల్ డేటా తీస్తే నిజాలు బయటకు వస్తాయి. కబ్జాలు తొలగించే సమయంలో కొందరు చిన్న పిల్లలతో వీడియోలు పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఫాతిమా కాలేజ్ సల్కం చెరువు ప్రిలిమినరి నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. ఫైనల్ ప్రిలిమినరి నోటిఫికేషన్ పూర్తి అయ్యాక ఎం చేయాలో చేస్తాం. గాజులరామారంలో ఎవ్వరికి టైం ఇవ్వలేదు. హైడ్రా ఎవరి ఇంటికి కరెంటు కట్ చేయలేదు. నివాస గృహలను ఎక్కడ కూడా కూల్చివేతలు చేపట్టలేదు. నివాస గృహలను హైడ్రా కూల్చదు. గాజుల రామారంలో గతంలో రెవెన్యూ వాళ్ళు అనేక సార్లు నోటీసులు ఇచ్చారు. ప్రతీది హైడ్రాకు అపాదిస్తున్నారు. మాకున్నది చిన్న ఆర్గనైజషన్. నాలాలకు సెపరేటుగా ఏజెన్సీ లు ఉన్నాయి. గాజుల రామారం కబ్జాల్లో రౌడీ షీటర్లతో పాటు పొలిటిషన్స్ కూడా ఉన్నారు. కబ్జా చేసిన పొలిటిషన్స్ పేర్లు గవర్నమెంట్ కి ఇచ్చాము. వెర్టెక్స్ తో హైడ్రా రాజీ పడిందని మాట్లాడే చిల్లర మాటలు ఆపుకోవాలి. నాళాలు కబ్జా చేస్తే వాసవి పై కేసు పెట్టించాం. కేసు పెట్టడం వల్ల బిల్డర్స్ కి రావాల్సిన ఫండ్స్ కూడా ఆగిపోయాయిజ. కబ్జాలు తొలగించే సమయంలో కొందరు యూట్యూబర్స్ చిన్న పిల్లలను పెట్టి ఏదో మాట్లాడించి, హైడ్రా పై నెగటివ్ గా వేస్తున్నారు. కబ్జాలను అలాగే వదిలేద్దమా?
ALSO READ : ఆపదలో ఉన్న సింగరేణిని కాకా వెంకటస్వామి ఆదుకున్నారు
ఈ మధ్య కాలంలో క్లౌడ్ బరెస్ట్ జరుగుతుంది. మొన్న కుత్బుల్లాపూర్ లో 18 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం హైదరాబాద్ లో కురుస్తుంది .నాలాల పునరుద్దరణ చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే 100 ఏళ్ల కు అనుగుణంగా నాలా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం 51 టీమ్స్ ఉన్నాయి. వాటిని 71 DRF టీమ్స్ కు పెంచాలని ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. ఇంకా నాలాల్లో డీ సిల్టింగ్ కూడా చాలా ముఖ్యమైంది.. అందుకోసం డీ సిల్టింగ్ కు హైడ్రా పెద్ద పీట వేయాలని నిర్ణయించాం. నాలాల్లో మొన్న ముగ్గురు కొట్టుకుపోయారు.. అందులో ఒక్కరి బాడీ వలిగొండలో దొరికింది..మిగతా వారి కోసం హైడ్రా తీవ్రంగా శ్రమించింది.. ఫ్లోటింగ్ ఎక్కువ గా ఉండడం తో ఇంకా దొరకలేదు. గేట్లు కూడా తెరవడంతో ఎక్కడో ఓ చోట దొరికే అవకాశం ఉంది’. అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.