
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించింది సర్కార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మూతపడుతుందన్న దశలో సింగరేణిని కాకా వెంకటస్వామి ఆదుకున్నారని అన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంలో బొగ్గు ఉత్పత్తి మొత్తని స్తంభింపచేసి అప్పటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యేక పాత్ర పోషించారని అన్నారు. సింగరేణి కార్మికుల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ఎప్పటికి గుర్తుంచుకుంటుందని అన్నారు.
దేశంలో వెలుగులు విరాజిల్లుతున్నాయంటే.. సింగరేణి కార్మికులు ఉత్పత్తి చేసిన బొగ్గు కారణమని అన్నారు సీఎం రేవంత్. నిరంతరం కస్టపడి రాష్ట్ర ఆదాయంలో, దేశ ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులను సంస్థకు వచ్చిన లాభాల్లో భాగస్వామ్యం చేస్తోందని అన్నారు. ఒకప్పుడు సింగరేణి సంస్థ నష్టాల్లో కూరుకుపోయి మూతపడే దశలో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి కేంద్రంతో మాట్లాడి సంస్థను ఆడుకున్నారని అన్నారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా లాభాల్లో నడుస్తుందని అన్నారు సీఎం రేవంత్.
ALSO READ : సింగరేణి కార్మికులకు భారీ గుడ్ న్యూస్..
ఇప్పుడు సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తూనే.. కార్మికుల భవిష్యత్తు కోసం చర్యలు చేపట్టామని అన్నారు. కార్మికులకు పండగ బోనస్ తో పాటు భవిష్యత్ పెట్టుబడుల కోసం కూడా నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా పండగ బోనస్ ఇస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్. సింగరేణి సంస్థ కార్పొరేట్ సంస్థలతో పోటీ పడి ఎదగాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్.