లక్ష్య సాధనలో స్థిరత్వం ఎంతో అవసరం : డాక్టర్ సరోజా వివేక్

లక్ష్య సాధనలో స్థిరత్వం ఎంతో అవసరం : డాక్టర్ సరోజా వివేక్
  • ఐఏఎస్ అధికారి దాన కిషోర్ 
  • అంబేద్కర్ కాలేజీలో కెరీర్ అంశంపై సెమినార్
  • హాజరైన కరస్పాండెంట్ డాక్టర్ సరోజా వివేక్

ముషీరాబాద్, వెలుగు: ప్రేరణ అనేది తాత్కాలిక భావం కాదని.. అది ఒక అలవాటుగా మారాలని ఐఏఎస్ అధికారి ఎం దాన కిషోర్ సూచించారు. లక్ష్యసాధనలో విద్యార్థులకు స్థిరత్వం ఎంత అవసరమన్నారు. గురువారం బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (అటానమస్) కాలేజీలో ‘కెరీర్, ఆశయాలు, ప్రేరణ’ అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దాన కిషోర్ హాజరై మాట్లాడారు. ప్రతికూల పరిస్థితులను అడ్డంకులుగా కాకుండా మనల్ని మరింత బలంగా తయారు చేసే అంశాలుగా చూడాలని సూచించారు. కెరీర్ ఎంపికలు, పోటీ పరీక్షలు, మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలను విద్యార్థులతో పంచుకున్నారు.

అనంతరం కాలేజీ కరస్పాండెంట్ డాక్టర్ సరోజా వివేక్ మాట్లాడుతూ.. ప్రముఖుల మార్గ నిర్దేశం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధికి ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  కాలేజీ సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.