మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడం.. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందని చెప్పడంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)  హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 88 ఏళ్ల వయసున్న మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఆరంభంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మొదలైనప్పుడు కరోనా బారిన పడ్డారు. అప్పుడు ఇదే ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స చేయించుకున్నాక కోలుకుని ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. 
దుర్గా నవరాత్రుల సందర్భంగా ఆయన ఒకింత అస్వస్థతతకు గురికాగా నిన్న డాక్టర్ల చెకప్ లో  రొటీన్ జ్వరం అని తేలింది. ఇవాళ బాగా నీరసించిపోవడంతో వెంటనే ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రముఖ వైద్యుడు  డాక్టర్‌ నితీష్ నాయక్‌ నేతృత్వంలోని డాక్టర్ల బృందం మన్మోహన్ సింగ్ కు చికిత్స అందిస్తోంది.